

మనన్యూస్,తిరుపతి:ఎం ఆర్ పల్లి పరిధిలోని 22వ వార్డు సచివాలయంలో టిడిపి నగర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయ్యాం గారు బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ డైరెక్టర్,వార్డు ప్రెసిడెంట్ ధరణి కుమార్ గుర్రం బాల,క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డేనియల్ రవీంద్రబాబు జనసేన వైస్ ప్రెసిడెంట్ ప్రభు అన్వర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో మన రాష్ట్రాన్ని అగరకంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు 22వ వార్డు సచివాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించామని వారు పేర్కొన్నారు.జెండా వందనం అనంతరం అక్కడున్న వారందరికీ స్వీట్లు మిఠాయిలు పంచి పెట్టారు.