

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఇటీవల అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు,9వ వార్డు కౌన్సిలర్ అలమండ చలమయ్యను శనివారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్ద కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతిలో ఉన్న చలమయ్యను తొలుత ప్రత్తిపాడు శాసనససభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా కలిసి యోగ క్షేమాలు విచారించారు.చలమయ్య త్వరగా కోలుకొని నగర పంచాయతీ ప్రజలకు సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు.ఆమె వెంట ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి),టిడిపి నాయకులు జ్యోతుల పెద్దబాబు,సూతి బూరయ్య కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి తదితరులు ఉన్నారు.తదుపరి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం,వైయస్సార్సీపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు అలమండ చలమయ్య నివాసానికి చేరుకుని పలకరించారు.ఏలేశ్వరం నగరంలో ప్రజలతో మమేకమై వారికి సేవ చేసే ఆలమండ చలమయ్య త్వరతగతిన కోలుకోని యధావిధిగా తన రాజకీయ కలాపాలు కొనసాగించాలని ముద్రగడ అన్నారు.ముద్రగడ వెంట వైసిపి నియోజకవర్గ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు,బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు,సామంతుల సూర్య కుమార్,ఇజనగరి ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.