

*మన న్యూస్, ఎస్ఆర్ పురం:-* వెదురుకుప్పం మండలం పచ్చికాపలం నందు నూతన లీడ్ షాపింగ్ మాల్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు తిరుపతి మార్గమధ్యంలో ఉన్న పచ్చికాపలం గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి వస్తువులు దొరకడం మన నియోజకవర్గ ప్రజలకు ఎంతో గర్వకారణం ఎందుకంటే సిటీలలో దొరికే వస్తువులు కూడా పల్లెటూర్లో దొరకడం ఎంతో అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ప్రతి వస్తువు సిటీలకు చిత్తూరు తిరుపతి ఇలాంటి నగరాలకు వెళ్లకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో దొరకడం వెదురుకుప్పం మండల ప్రజల అదృష్టంగా భావించాలి అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు..వెదురు కుప్పం మండలం పచ్చకాఫలం లో నీలారెడ్డి నూతన లీడ్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల ఫర్నిచర్లు టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు హోల్ సేల్ ధరలకే వినియోగదారులకు అందిస్తామని లీడ్ షాపింగ్ యజమాని నీలారెడ్డి తెలిపారు., ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ మురళీ కృష్ణారెడ్డి ముని చంద్రారెడ్డి వెదురుకుప్ప మండల అధ్యక్షుడు లోకనాథరెడ్డి,వెదురుకుప్పం మాజీమండల అధ్యక్షుడు మోహన్ మురళి, నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు