

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం;ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ప్రణాళిక తయారీలో భాగంగా బాలల సభను గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి సత్య రాణి నాగ భార్గవి అధ్యక్షత గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భార్గవి మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన అవసరాలను తెలుసుకోవడం,కిశోర వికాసం, బాలల హక్కులు,బాల్యవివాహాల నిషేధ చట్టం, ఫోక్స్ చట్టం గురించీ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ బాలల సభ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇసనగిరి శివప్రసాద్,ఐసిడిఎస్ సూపర్వైజర్, స్కూల్ చైర్మన్,అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.