మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.అనంతరం
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు..
ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటంపై ఇరువురు నేతలు మంతనాలు సాగించారు.. కామారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు..సీనియర్ నాయకులైన పోచారంతో కలిసి వివిధ అంశాలపై చర్చించిన ఆయన ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాల్ని తిప్పికొట్టాలన్నారు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా కామారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు దిశానిర్దేశంపై మాట్లాడారు..
ఎమ్మెల్యేతో పాటు ఎన్ ఆర్ ఐ వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *