మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలిఅధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

మనన్యూస్,గద్వాల జిల్లా: నేడు మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిజిల్ల,జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ శ్రీ B M సంతోష్ మునిసిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న తో నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జిల్లా కలెక్టర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను, పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణం ను, నర్సరీ, SC కాలానికి వెళ్ళే మార్గం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర పనులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పెండింగ్ పనులను నాణ్యతతో కూడిన విధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించి,అంబేద్కర్ చౌక్ నుండి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్‌కి నేరుగా వెళ్లే రహదారిని మూసివేసి ట్రాఫిక్ కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రజలకు రాకపోకలో ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.మార్కెట్‌కి అనుబంధంగా ఉండే ప్రవేశ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.అదేవిదంగా అంబేద్కర్ చౌక్ నుండి SC కాలనీ కి వెళ్ళే సీసీ రొడ్డు యంకన్న కట్ట నుండి జగజీవన్ రామ్ విగ్రహం వరకు గుంతల మయంగా ఉన్న రోడ్డును పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ పట్టణం లో జరిగిన అభివృద్ధి పనుల ను చూసి హర్షం వ్యక్తం చేశారు. అలాగే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వేలం ఎందుకు లేట్ అయ్యిందో అడిగి ఆరా తిశారు.తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్మన్ దేవన్న శాలువా కప్పి గజమాల తో సత్కరించారు కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజయ్య ఇంజనీర్ శ్రీ రాజశేఖర్ , మేనేజర్ శ్రీ అశోక్ కుమార్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు గజ్జి దేవరాజు గారు, ముఖ్య అధికార యంత్రాంగం మొత్తం పాల్గొన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///