

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో బియ్యం దొంగలు హడలెత్తిపోయినట్లు తెలిసింది ఎర్రవల్లి, కేటిదొడ్డి, అయిజ ,మండలాలపాటు గద్వాల పట్టణంలో రహస్యంగా పర్యటించి.అనుమానాస్పద రైస్ మిల్లులో తనఖీలు చేవట్టారు ఈ క్రమంలో రాత్రి ఎర్రవల్లి మండలం దువాసిపల్లి ,వద్ద ఉన్న ఓ రైస్ మిల్లుకు సమీపంలో 153 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నారు బియ్యాన్ని సీజ్ చేసి కోదండపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అప్పగించి కేసు నమోదు చేశారు.అలాగే కేటిదొడ్డి మండలం నందిన్నెలోని ఓ రైస్ మిల్లులో రైతు వద్ద తీస్తుకున్న ధాన్యానికి సంబంధించి లెక్కల్లో తేడాలు ఉండటం గమనించిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సదరు మిల్లు యజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది
గుట్టుగా పర్యటన,రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జిల్లా లో గుట్టుగా పర్యటించారు.జిల్లా వ్యాప్తంగా 64 రైస్ మిల్లులు ఉండగా పలు మిల్లులుపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం ఈ మేరకు వారు రహస్యంగా ఫిర్యాదులు వచ్చిన మిల్లుల్లో తనఖీలు నిర్వహించి వెళ్ళినట్టు తెలిసింది అయితే ఈ తనఖీలు గురించి బయటకు పోక్కపండా జాగ్రత్తలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సివిల్ సప్లయ్ శాఖ జిల్లా అధికారులు వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం. అయితే దువాసిపల్లి సమీపంలో పట్టుకున్న లారీ లో రూ 7 లక్షల విలువ వైన 153 క్వింటాళ్ల బియ్యం ఉన్నయన్ని.ఈ విషయమై సివిల్ సప్లయ్ అధికారి మహర్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదండాపురం ఎస్సై స్వాతి తెలిపారు
పోలీసులు అదుపులోకి తీసుకున్న బియ్యం లారీ