

మన తెలంగాణ జనవరి 03:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యాపక సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అధ్యాపక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు మహాత్మ జ్యోతిరావు పూలే స్త్రీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి తెలిపారు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలో ఆడపిల్లలకు చదువు ఉండాలని ఒక సంకల్పంతో సావిత్రిబాయి ముందుగా చదువు నేర్పి తరువాత ఆడపిల్లల చదువు కోసం సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు అసమనతులు ఎదుర్కొని అనేకమంది ఆడపిల్లలకు చదువు ఉండాలనే సదుద్దేశంతో అవమానాలను భరించి నేడు భారతదేశంలోనే చదువు నేర్పిన పంతులమ్మగా మొదటి స్థాయిలో నిలిచారు అని అన్నారు ,అందుకే సావిత్రిబాయి పూలే జయంతిని జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేశారు