

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజావాణిలో మొత్తం 58 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సమస్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.