

మన న్యూస్ డిసెంబర్ 29:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం భవన&ఇతర నిర్మాణ రంగాల కార్మిక శాఖ ఆధ్వర్యంలో సి ఎస్ సి వాళ్లు ఎల్లారెడ్డి లోని బిందర్ లో కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో కార్మిక నాయకులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ అందిస్తున్న సేవలను కార్మికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది మరియు ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేయించుకోవాలని వారికి ఎదైనా సమస్య ఉంటే నాయకులకు తెలపాలని నాయకులు వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఎస్సి హెల్త్ క్యాంప్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ నాయక్ జిల్లా కోఆర్డినేటర్ సాయన్న ఎల్లారెడ్డి మండల కార్మిక నాయకులు జిల్లా కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్ మేస్త్రి, బెల్దర్ తూకారాం, సంగమేశ్వర్ మేస్త్రి, గణేష్ మేస్త్రి, అబ్దుల్ రజాక్, జిల్లా ప్రచార కార్యదర్శి పాల్గొన్నారు