నెల్లూరు, మన ధ్యాస, నవంబర్ 23 : నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం కుమ్మర, శాలివాహన సంఘం వారు మీడియా సమావేశం నిర్వహించినారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…….నెల్లూరు అంబాపురం కొత్తూరు కుమ్మర శాలివాహన సంఘం ప్రభుత్వం వారు నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం వారి అభ్యర్థన మేరకు రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు ఇలాపురం వెంకయ్య ఎక్స్ ఎంఎల్సి ఒక ఎకరా భూమిని ప్రభుత్వ ధరకు ఇవ్వడం జరిగింది 2012 వ సంవత్సరంలో జిల్లా శాలివాహన సంఘం వారు మన రాష్ట్రము మరియు ఇతర రాష్ట్ర శాలివాహనుల నుండి విరాళములు స్వీకరించి భవన నిర్మాణము చేశారు 2015 సంవత్సరం నాటికి కళ్యాణ మండపము నిర్మాణము చాలావరకు అంటే సుమారు 75 పూర్తి చేసి ప్రారంభించడం జరిగినది అప్పటికి దానికి ఖర్చు పెట్టినది సుమారు రూ 98,00,000/-లు (అక్షరముల తొంబై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే) 2015 సంవత్సరంలో జిల్లా కుమ్మర శాలి వాహన శాలివాహన సంక్షేమ భవన నిర్వహణ కమిటీ (రిజిస్టర్ నెంబర్ 192/2015) అను పేరుతో స్థాపించి కళ్యాణ మండప కార్యకలాపాలు నిర్వహించ వలసినదిగా కోరడమైనది. అప్పటినుండి ఆ సొసైటీ వారు కళ్యాణమండపమును నిర్వహించుచున్నారు 2024వ సంవత్సరంలో లీజుకు తీసుకున్న పత్తిపాటి రామయ్య తో వచ్చిన విభేదాల వల్ల సొసైటీ వారు లీజు చెల్లింపు కొరకై కోర్టుకు వెళ్లవలసి వచ్చింది ప్లీజ్ దానితో వచ్చిన విభేదాలను సాకుగా ఇతర సంఘాలకు చెందిన వ్యక్తులు వేరొక సొసైటీని స్థాపించి కళ్యాణ మండప మేము నిర్వహించుచున్నామని చెప్పుకొనుచున్నారు కానీ మండపమునకు పూర్తి హక్కుదారు ఇలాపురం భాస్కర శ్రీనివాస్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం వారు మాత్రమే శాలివాహన భవన నిర్వహణ కమిటీ అను సొసైటీకి ఎన్నికలు జరపవలెనని13.10.2024 తేదీని నిర్ణయించడం అయినది కానీ కొంతమంది వ్యక్తులు ఆ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్నారు ప్రస్తుతం శాలివాహన భవన సొసైటీ వారు కోర్టు ద్వారా అన్ని రకముల అడ్డంకులను తొలగించుకుని ఎన్నికలు జరుపుటకు ముందుకు పోవడం జరుగుతున్నది కొంతమంది వ్యక్తులు ఈనెల 29వ తేదీ కార్తీక వనభోజన కార్యక్రమములు జరుగుచున్నామని ప్రెస్ మీట్ ద్వారా తెలియపరిచినారు ఈ కార్యక్రమానికి మా జిల్లా కుమ్మర శాలివాహన సంఘం వారికి ఎటువంటి సంబంధం లేదు ఈ వన భోజన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి కూడా లేదు ప్రస్తుతము కొన్ని వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నందువలన అక్కడ ఏ కార్యక్రమమూ కూడా జరుపకూడదని తెలియజేస్తున్నాము ఈ విషయమైతే తేదీ01.02.2025 న హెచ్చరిక నోటీసు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలయందు కూడా ప్రచురించబడినది చివరగా ఈ శాలివాహన భవనము మన శాలివాహములది మాత్రమే దీనిపై వచ్చేటటువంటి రాబడి శాలివాహనులందరికి చెందుతుంది ఈ శాలివాహన భవన మన జిల్లా నెల్లూరు కుమ్మర శాలివాహన సంఘం లేదా వారి ద్వారా నియమించబడిన వారికి మాత్రమే నిర్వహణ బాధ్యత ఉంటుంది ఈ కార్యక్రమంలో యడవల్లి మల్లికార్జున, కె.ఎస్ నరసయ్య కార్యవర్గ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *