కలిగిరి, నవంబర్ 19,మన ధ్యాస RC ఇంచార్జి నాగరాజు.

కలిగిరి లో జరిగిన ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా కలిగిరి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో ఘన విజయం సాధించి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో కలిగిరి ఎంపీపీగా బిజ్జం వెంకట కృష్ణా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను ఆదరించి ఈ అవకాశం కల్పించిన మండల ప్రజలందరికీ, కి* ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాబోయే రోజుల్లో మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ పోల్స్, వీధి లైట్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రతి పేదవాడికి చేరేలా పని చేస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని పేర్కొన్నారు.ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *