తిరుప‌తిలో మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాలి..సీ.డాప్ ఛైర్మ‌న్ దీప‌క్ రెడ్డి తో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు..స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని విన‌తి

మన న్యూస్: తిరుపతి,విజ‌న్-2047 సాకారం దిశ‌గా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు స‌హ‌క‌రించాల‌ని సీడాప్ ఛైర్మ‌న్ జి.దీప‌క్‌రెడ్డి ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు కోరారు.విజ‌య‌వాడ‌లోని సీ.డాప్ కార్యాల‌యంలో శుక్రవారం సీ.డాప్ ఛైర్మ‌న్‌ను శాప్ ఛైర్మ‌న్ శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ, ఉపాధి క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వారిరువురూ చ‌ర్చించారు. తొలుత శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు మాట్లాడుతూ తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో సుమారు 2ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ, పీజీ,ఇంజినీరింగ్‌లు పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్నార‌న్నారు.తిరుప‌తికి మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు,ఇండ‌స్ట్రీల‌ను తీసుకొచ్చి మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాల‌ని, నిరుద్యోగులంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన్న‌వించారు. దీనికార‌ణంగా తిరుప‌తిలో నిరుద్యోగుల సంఖ్య త‌గ్గుతుంద‌ని,యువ‌త‌కు ఉపాధి క‌ల్పించిన‌వార‌మ‌వుతామ‌ని వివ‌రించారు. అలాగే తిరుప‌తి జిల్లాలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేసి యువ‌త‌కు ఉపాధి శిక్ష‌ణ నైపుణ్యాల‌ను పెంచేందుకు కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.దీనికి సంబంధించి ఇప్ప‌టికే శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో 50ఎక‌రాల‌కుపైగా భూమిని గుర్తించామ‌న్నారు.సీడాప్ కూడా దీనిపై దృష్టి సారించి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ప‌నులను త్వ‌రగా ప్రారంభించాల‌ని ఆకాంక్షించారు.దీనిపై సీడాప్ ఛైర్మ‌న్ కూడా సానుకూలంగా స్పందిస్తూ యువ‌త భ‌విత‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని, త‌ప్ప‌నిస‌రిగా తిరుప‌తి పార్ల‌మెంటులో మెగా జాబ్‌మేళా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బ‌దులిచ్చారు.ఈ కార్య‌క్ర‌మానికి ముందు సీడాప్ ఛైర్మ‌న్ దీప‌క్‌రెడ్డి కి శాప్ ఛైర్మ‌న్ శాలువా క‌ప్పి స‌త్క‌రించారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు