శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ అఫ్రోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా, ఎల్లమ్మ గుడి వంశపారంపర్య ధర్మకర్త ఏడుమలై రెడ్డి, పోస్ట్ ఆఫీస్ అంబికాపతి, మధు తదితరులు పాల్గొని ఆయనకు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ… , క్రమశిక్షణే కవచంగా తెలుగుదేశం పార్టీ పట్ల అచంచలమైన విధేయతతో ముందుకు సాగే నిబద్ధత కలిగిన నాయకుడు అఫ్రోజ్. గత 15 సంవత్సరాలుగా ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, తన కష్టపడే తత్వంతో ఈరోజు శ్రీకాళహస్తి టిడిపి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు.
రాజకీయాల్లో పదవులు రావచ్చు… పోవచ్చు… పరిస్థితులు మారవచ్చు… కానీ పార్టీ పట్ల చూపించే విశ్వాసం, కష్టకాలంలోనూ నిలబెట్టుకునే నిబద్ధత, కార్యకర్తలతో కొనసాగించే ఆత్మీయ అనుబంధం ఒక నాయకుడి నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అలాంటి నిబద్ధతతో పనిచేస్తున్న అఫ్రోజ్ తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పార్టీ సమాచారాన్ని, నాయకుల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
నిరాడంబరత, మంచి సుగుణాలు మరియు సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా రేణిగుంటతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులయ్యారు. పార్టీకి ఆయన చేసిన నిరంతర సేవలను గుర్తించి శ్రీకాళహస్తి శాసనసభ్యులు గుర్తించే స్థాయికి ఎదిగాడు.
ఈ జన్మదినం ఆయన జీవితంలో సరికొత్త ఆశలకు, మరిన్ని అవకాశాలకు, ఉన్నతమైన రాజకీయ బాధ్యతలకు నాంది కావాలి. అ దేవుడు ఆశీస్సులతో ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని, తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అఫ్రోజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
