​రేణిగుంట.

శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ అఫ్రోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా, గుడి వంశపారంపర్య ధర్మకర్త ఏలుమలై రెడ్డి, అంబికాపతి, మధు తదితరులు పాల్గొని ఆయనకు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ… గత 15 సంవత్సరాలుగా ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షేక్ అఫ్రోజ్, తన కష్టపడే తత్వంతో శ్రీకాళహస్తి టిడిపి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎదిగారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
​తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అఫ్రోజ్, సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పార్టీ సమాచారాన్ని, నాయకుల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నిరాడంబరత, మంచి సుగుణాలు మరియు సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా రేణిగుంటతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులయ్యారని పేర్కొన్నారు.
​టిడిపికి ఆయన చేసిన నిరంతర సేవలను గుర్తించి శ్రీకాళహస్తి శాసనసభ్యులతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఆయనను గుర్తుపట్టే స్థాయికి ఎదిగారని ఫరీద్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని అఫ్రోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *