మన ధ్యాస, నెల్లూరు, అక్టోబర్ 30 : నెల్లూరు జేమ్స్ గార్డెన్స్, రామ్మూర్తి నగర్ ప్రాంతాల్లో..జరిగిన వైసిపి ఎన్నికల కార్యక్రమానికి..వైసిపి నెల్లూరు సీటి నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై వైసిపి 60వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆశ్రిత్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ చార్జ్ నేతాజీ సుబ్బారెడ్డి తో కలిసి.. ప్రజలకు నమస్కరిస్తూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను చంద్రశేఖర్ రెడ్డి,ఆశ్రిత్ రెడ్డి అభ్యర్థించారు. నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో.. ప్రజలు నెల్లూరు మేయర్ గా ఆనం విజయకుమార్ రెడ్డి ని, 60 డివిజన్ కార్పొరేటర్ గా ఆశ్రీత్ రెడ్డి ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో వైసిపి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అధికార పక్షం.. చేస్తున్న కుట్రలు మోసాలు, దోపిడీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం రెండు సాధ్యమని.. నమ్ముతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. బాధ్యతగల యువకుడు మంచి మనసుతో ముందుకు వస్తున్న.. 60వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆశ్రిత్ రెడ్డిని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేస్తున్న..మేయర్ అభ్యర్థి ఆనం విజయ కుమార్ రెడ్డి , వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు.. ప్రజలకు.. తమ వంతుగా సేవ చేయాలని.. ముందుకు వస్తున్న వారేనని.. వారిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించి కార్పొరేషన్ లో వైసీపీ జెండా..ఎగరవేయడం ఖాయమని.. నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గెలుపొందడం తద్యమన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. వైసిపి నేతలపై ఎన్ని అరాచకాలు.. చేయాలో.. అన్ని చేస్తూ.. దుర్మార్గాలకు పాల్పడుతుందని .. దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.కూటమి నాయకులు..వైసీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టి.. దౌర్జన్యాలు చేస్తూ .. వారిపై బెదిరింపులకు దిగుతుండడం ప్రజాస్వామ్యానికే మచ్చ అన్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న.. దుర్మార్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని.. చేస్తున్న దుర్మార్గాలను కొట్లాడటానికి ఎంత దూరమైన వెళ్తామన్నారు.ఈరోజు కార్పొరేషన్ లో భారీ అవినీతి.. జరుగుతుందని చెట్టు దగ్గర నుంచి, చెత్త వరకు.. అన్ని పనులు అవినీతి మయంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈరోజు కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని.. రేపు కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత.. వాటన్నిటిపై విచారణ జరిపి.. దోషులను శిక్షించడంతోపాటు.. కార్పొరేషన్ లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లి నిర్మల ,స్థానిక డివిజన్ నాయకులు మోహన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *