తిరుపతి అక్టోబర్ 30.

తిరుపతి నగర కార్పొరేషన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా 8 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొడుగుచింత గోపిప్రసాద్ విజయం కొరకు డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగినది.
డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారని ఈ ఎన్నికలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దగ్గరకు చేస్తుందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయుటకు వారధిలా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,జిల్లా నాయకులు,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *