

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీ కేసలి గ్రామంలో గురువారం నాడు జరిగిన రెవెన్యూ సదస్సులో సమస్యలు ఏకరువు పెట్టాయి.పంచాయతీ సర్పంచ్ సత్తారపు నిర్మల ఆధ్వర్యంలో ప్రజలంతా కలిసి మండల తహసిల్దార్ డి రవికి వారి సమస్యలను విన్నవించుకున్నారు గ్రామానికి పక్కన ఉన్న శ్రీ వసంతలమ్మ అమ్మవారికి సంబంధించిన ఐదు ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైందని, కొంతమంది పెత్తందార్లు కలసి అక్రమాలకు పాల్పడ్డారని వెంటనే ఆక్రమణలు తొలగించి అమ్మవారు భూమిని కమిటీకి అప్పగించాలని కోరారు. అలాగే కొంతమంది రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సర్పంచ్ నిర్మల మాట్లాడుతూ మా పంచాయతీలో నెలకొన్న భూతగాదాలు వంటి సమస్యలుకు వెంటనే పరిష్కారం చూపించాలని ను తహసీల్దార్ ను కోరారు.ఉదయం కేసలి పంచాయతీలో రెవెన్యూ సదస్సు జరగగా మధ్యాహ్నం కొటికి పెంట పంచాయితీలో సిహెచ్డిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.రెవెన్యూ సదస్సులో కొత్తపేట,ఒలిసులమడ గిరిజన గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇంతవరకు సర్పంచ్ అప్పలనాయుడు తరచూ జిల్లా అధికారులను,మండలం అధికారులుకు మా సమస్యలు తెలియజేసినప్పటికీ స్పందన అంతంతమాత్రంగా ఉందని మీరు వెంటనే స్పందించి అమాయకపు గిరిజనులు సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని సర్పంచ్ అప్పలనాయుడు కోరారు.ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు సిబ్బంది ప్రజలు హాజరయ్యారు.