ఏర్పేడు అక్టోబర్ 29.
స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏర్పేడు మండలం పాతవీరపురం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంగరపు రవి (సైకిల్ గుర్తు) విజయాన్ని కాంక్షిస్తూ మాధవమాల గ్రామంలో ఎన్నికల ప్రచారం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొంగరపు రవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, జడ్పీటీసీ మునిరాజ (హేమాక్షి ), నిరంజంబాబు,శివశంకర్ రెడ్డి, నైనూరు పున్నారావు, సూరి నాయుడు, పూల హేమాక్షి, బాబు నాయుడు, సీతాపతి ఆచారి, చంద్ర రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవి రెడ్డి, రాఘవేంద్ర, గుణా యాదవ్, రాచేటి సుబ్రమణ్యం, మధు, కేకే రమణ, నారాయణ, మునిరెడ్డి, నరసింహులు, గోపాలరెడ్డి, నరసింహులు నాయుడు, గణేష్ నాయుడు, సుధాకర్ నాయుడు, బాలాజీ, అశ్వద్ధామ, రామదాసు పాల్గొన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు సురేష్, రాం బత్తయ్య, కే. కిరణ్, సుబ్రమణ్యం, మనోహర్ మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

