తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో మన అభ్యర్థులకు శ్రీరామరక్ష అని తెలిపారు.

రాబోయే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరపున 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొట్టే రుక్మిణమ్మ (కొట్టే హేమంత్ రాయల్ తల్లి)కి మరియు తిరుపతి మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ (జేబీ శ్రీనివాస్) కి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.

ఓటరు మహాశయులందరూ బ్యాలెట్ పేపర్‌లో వరుస సంఖ్య 2 లో ఉన్న “సైకిల్” గుర్తుపై తమ విలువైన ఓటును ముద్రించి, రుక్మిణమ్మ ని మరియు జేబీ శ్రీనివాస్ ని ఆశీర్వదించాలి అని తెలిపారు.

కాలనీలో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల లేమిపై ప్రజలు విన్నవించిన సమస్యలను ఆయన ఓపికగా అడిగి తెలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై 13వ డివిజన్‌కు చెందిన పలువురు స్థానికులు, యువత, ఇతర పార్టీల కార్యకర్తలు ఎన్డీఏ కూటమిలో చేరారు.

వారందరికీ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *