ఉదయగిరిలో ప్రతిపక్షానికి షాక్ – 7 ఎంపీటీసీలు 1 జడ్పీటీసీ ఏకగ్రీవం.జిల్లాలోనే కూటమి క్లీన్ స్వీప్ చేసిన మండలం ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం.ఏకగ్రీవంగా మండలంలోని 7 ఎంపీటీసీలు, జడ్పీటీసీ కూటమి కైవసం. ఉదయగిరి నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో 10 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
వింజమూరు, అక్టోబర్ 29, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు కె.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేకత సంతరించుకుంది.ఈ నియోజకవర్గంలో 8 మండలాలు ఉండగా సీతారాంపురం మండలంలోని జడ్పీటీసీ స్థానం, మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి వైసీపీ పార్టీ ఈ మండలంలో పోటీలో కూడా నిలవలేకపోయింది. ఇది జిల్లాలోనే ఒక రికార్డు.అంతేకాక నియోజకవర్గంలోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో 10 ఎంపీటీసీ స్థానాలు కూడా కూటమి పార్టీ ఏకగ్రీవంగా చేసుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో మొత్తం 18 స్థానాలు ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకి వెళ్లాయి.నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి పలు గ్రామాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పింఛన్లను రూ.4000 కు పెంచడం, రోడ్లు, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేయడం వల్ల ప్రతిపక్ష వైసీపీకి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు.జిల్లాలో ఒక మండలం మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకున్న దాఖలాలు ఇప్పటివరకు ఎన్నికల చరిత్రలో లేవు. ఇది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమర్థవంతమైన నాయకత్వానికి, కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.మిగిలిన ఏడు మండలాల్లో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ పదవులు కైవసం చేసుకునే దిశగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.నియోజకవర్గంలో ప్రచారంలో కూటమి పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి జోరు కొనసాగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో భయ ఆందోళన నెలకొంది.