కలిగిరి, అక్టోబర్ 29, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.కలిగిరి మండల టీడీపీ *జడ్పీటీసీ అభ్యర్థి మెట్టుకూరి శిరీషా రెడ్డి*, కలిగిరి *ఎంపీపీ, తెల్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి బిజ్జం వెంకటకృష్ణారెడ్డి* లు సంయుక్తంగా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.మండలంలోని *తెల్లపాడు గ్రామంలో* పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు* నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ముఖ్యంగా పింఛన్ల విషయంలో గత ప్రభుత్వం రూ.2000 ఇచ్చిన పింఛన్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే *రూ.4000 కు పెంచిందని*, వికలాంగులకు *రూ.6000*, కిడ్నీ, లివర్ బాధితులకు *రూ.10,000* పింఛన్ అందిస్తూ ప్రతి నెల *1వ తేదీ ఉదయాన్నే* వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తూ అవ్వా తాతలకు అండగా నిలుస్తోందని తెలిపారు.ఎమ్మెల్యే *కాకర్ల సురేష్* నాయకత్వంలో కలిగిరి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గెలిచిన తర్వాత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా అభ్యర్థులు హామీ ఇచ్చారు.మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనుభవం ఉన్న నాయకులను గెలిపించుకోవాలని కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *