

మన న్యూస్:ఏలేశ్వరం సహకార సంఘం ఆవరణలో జరిగిన సహకార రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల సంయుక్త సమన్వయకర్త సమన్వయకర్త డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రాల పరిధిలో సహకార సంఘాలు సహకార రంగ విస్తరణలో భాగంగా సంఘములు బలోపేతం కావడానికి వనరుల్లో సమీకరణకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో తీసుకోవలసిన జాగ్రత్తలను సంఘముల నిర్వాహణలో ఆర్థిక క్రమశిక్షణ కంప్యూట రైజేషన్వంటి ఒక లక్ష మూడువేల నూతన మల్టీపర్పస్ ప్రాథమిక పరపతి సహకార సంఘాలు ఒక లక్ష 6 వేల పాల ఉత్పత్తిదారుల సంఘాలు స్పెషరీస్ 11వేల ఫిషరీస్ సహకార సంఘాలు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో నాబార్డు ద్వారా ఏర్పాటు కానున్నవని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాక సహకార సంఘాలపై పలు అంశములను సంఘ సభ్యులకు సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డిసిసిబి మేనేజర్ రవికుమార్ సూపర్వైజర్ నాగేంద్ర ఏలేశ్వరం కో-ఆపరేటివ్ సొసైటీ సీఈవో జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్ సంఘ రైతు సభ్యులు బంటుపల్లి సత్యనారాయణ గుణాపు అప్పలరాజు గంధం కాశి సంఘ సిబ్బంది పాల్గొన్నారు.