

మన న్యూస్: మండలంలొని తిరుమలయ్య పల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో చెందిన 1) వై. పరదేశీ రెడ్డి కుమారుడు వై.నరసింహారెడ్డి, వయసు 25 సంవత్సరాలు 2) వై పరదేశీ రెడ్డి కుమారుడు వై.మల్లికార్జున, వయస్సు 34 సంవత్సరాలు,వీరిద్దరూ అక్రమంగా మద్యం అమ్ముతూ ఉన్నారని రహస్య సమాచారంతో స్థానిక ఎస్సై వెంకటసుబ్బయ్య మరియు వారి సిబ్బంది కలసి రైడ్ చేసి వారి వద్ద నుండి 9 కింగ్ ఫిషర్ బీర్లు, ఆంధ్ర మ్యాన్షన్ హౌస్ 750 ml 6 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 180 ml మూడు బాటిల్స్, ఇన్ఫీరియల్ బ్లూ 750 ml 5 ఐదు బాటిల్స్ , నెపోలియన్ కొరియర్ 750 ml 3 బాటిల్స్,నెపోలియన్ కొరియర్ 375 ml 5 బాటిల్స్,నెపోలియన్ కొరియర్ 180 ml 15 బాటిల్స్,బెంగళూరు బ్రాందీ 180 ml 26 ప్యాకెట్లు,ఒరిజినల్ సైజ్ 90 ml 25 ప్యాకెట్లు
మొత్తం 37 బాటిల్స్,కర్ణాటక టెట్రా ప్యాకెట్లు 51 పట్టుకున్నారు సర్ కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్సై తెలియజేశారు .