

మన న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరి శికర గ్రామాల్లో 7 I.T.D.A ల పరిధిలో 14.27 కోట్ల వ్యయంతో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ గర్భిణీలు ఏడు రోజులు ముందుగా వచ్చి ఉండటానికి మరియు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది.
122 ఫీడర్ అంబులెన్సులు మంజూరు చేయించడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా 28 ఏకలవ్య మోడల్ స్కూల్స్ 325 టీచింగ్ మరియు 139 నాన్ టీచింగ్ స్టాఫ్ ను భర్తీ చేయించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా హాస్టల్లో పిల్లలకు సరైన సౌకర్యాలు అందించలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిల్లలకు ట్రంకు పెట్టెలు, గ్లాసులు,దుప్పట్లు రగ్గులు అందజేయడం జరిగింది గుంతల రహిత రాష్ట్రమే ధ్యేయంగా 300 కోట్లు మంజూరు చేయడం జరిగింది పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పూర్తిగా నిర్మూలించి లక్ష ఎకరాలలో కాఫీ పంటను విస్తృతంగా సాగు చేసే ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మరుగున పడేసిన ట్రైకార్ లోన్లను కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్లికేషన్లు మొదలుపెట్టి గిరిజన ప్రాంత ప్రజలకు 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 90 కోట్ల అంగన్వాడీ బిల్డింగులు మరియు తాగునీటి కోసం ఖర్చు చేయడం జరిగింది
52.60 కోట్లతో 9246 అంగన్వాడీలకు మరుగుదొడ్లు మరియు 11,403 కేంద్రాలలో నీటి సదుపాయానికి ఖర్చు చేయడం జరిగింది
గిరిజన ప్రాంతాలలో PM జన్మన్ కింద 139 కొత్త అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయడం జరిగింది ఈ ఆరు నెలల్లో 780 బాల్య వివాహాలు అరికట్టడం జరిగింది బిక్షాటన చేసే 371 మంది పిల్లలకు పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది ఆడపిల్లల్ని రక్షించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.