తిరుపతి , మన ధ్యాస :- తిరుపతికి చెందిన వరుణ్ తేజ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్న పిల్లలు విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం కూచిపూడి తదితర కార్యక్రమాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ అకాడమీ నిర్వహికులు మాట్లాడుతూ మన హిందూ సంప్రదాయ సాహిత్యం, సంస్కృతం సాంప్రదాయాలు నేటి యువతకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం జరుగుతుందని తెలిపారు. వాటిని చిన్నతనం నుంచే నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని అందుకే తమ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిన్న పిల్లలకు కళా ప్రదర్శన ఇచ్చి అందులో ప్రతిబి కనబరిచిన వారికి పోర్చాకార బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో గాని ఇలాగే ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *