చిన్నక్రాక గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటి తెలుగుదేశం ప్రచారం ..

జలదంకి సెప్టెంబర్ 6, మన న్యూస్ నాగరాజు కె

కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం (డోర్ టు డోర్)” కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జలదంకి మండలంలోని చిన్నక్రాక గ్రామంలో స్థానిక గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి చర్యలను ప్రజలకు సవివరంగా వివరించారు.రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శకమైన, ప్రజానుకూల పాలనను అందిస్తూ అభివృద్ధి – సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు.అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *