మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్ క్లూజివ్ స్టోరు శనివారం సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలు, వినూత్న డిజైన్లతో నగర ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. పలు నగరాలలో వినియోగదారుల మనస్సులు గెలుచుకున్న ‘ఏకాధి’ అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన ఆకర్షణీయమైన డిజైన్లు, నాణ్యమైన ప్రత్యేక వెండి ఆభరణాలను మరింత మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో నెల్లూరులో ఈ సరికొత్త స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఏకాధి డైరెక్టర్ వేణు రాచకొండ మాట్లాడుతూ…. ఆభరణాల ప్రియుల అద్భుత స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఏకాధి పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ నిజంగా ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఈ విస్తరణ కేవలం వ్యాపార వృద్ధి మాత్రమే కాదని, మరింత మందికి అత్యుత్తమ కళా నైపుణ్యాన్ని అందించడం మా లక్ష్యమన్నారు. నాణ్యతలలో ఎలాంటి రాజీ లేకుండా ప్రత్యేకమైన వెండి ఆభరణాలను అందరికీ అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఏకాధి డైరెక్టర్ శివ్ చరణ్ వుప్పలంచి మాట్లాడుతూ…..పెళ్లికూతురు అయినా, గృహిణి అయినా, సహజమైన అందాన్ని ఇష్టపడే వారైనా ప్రతి మహిళ మనస్సుకు నచ్చే విధంగా మా బ్రాండ్ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి కొత్త స్టోర్తో మీ ప్రతి వేడుకలోనూ ‘ఏకాధి’ భాగస్వామిగా మారుతోందని తెలిపారు.ఈ సందర్భంగా నెల్లూరు ఫ్రాంచైజ్ భాగస్వాములు వానరాసి గౌతమ్, కొండేటి సాయి కృష్ణ, యన్నారు.వెంకటేష్ మాట్లాడుతూ…. అత్యుత్తమ వెండి ఆభరణాల కోసం ఏకాధికి విచ్చేయాల్సిందిగా కోరారు. ప్రత్యేక కలెక్షన్లు, ఆకర్షణీయమైన డిజైన్లు, అద్భుతమైన కళా నైపుణ్యాన్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ప్రత్యేక కలెక్షన్లు సంప్రదాయాన్ని, ఆధునిక పోకడలను అద్భుతంగా సమ్మిళితం చేస్తూ, భారతదేశంలో శాశ్వతమైన ఆభరణాల కళారీతుల స్ఫూర్తితో రూపొందించిన విభిన్నమైన అందమైన డిజైన్లను అందిస్తున్నామన్నారు. నెక్లెస్లు, హారాలు, చెవి దుద్దులు, గాజులు, బ్రాస్లెట్లు, ఉంగరాలు, జుంకాలు, లాకెట్లు వంటి మరెన్నో వెండి ఆభరణాలు పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక శుభకార్యాలతో పాటు రోజువారీ అందానికి సరిగ్గా సరిపోయేలా తీర్చిదిద్దబడ్డాయని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అని అన్నారు. రూ.10,000 కొనుగోలుపై ప్లాట్ రూ.1,000 తగ్గింపు కలదన్నారు. రూ. లక్ష కొనుగోలుపై రూ.25,000 గిఫ్ట్ ఓచర్, రూ.రెండు లక్షల కొనుగోలుపై రూ.60,000 గిఫ్ట్ ఓచర్ ఇవ్వనున్నామని చెప్పారు. స్వర్ణ శ్రావణ ఆఫర్లు కస్టమర్లు ఉత్తేజకరమైన స్వర్ణ శ్రావణ బహుమతులను కూడా పొందవచ్చన్నారు. కనీస కొనుగోలు రూ5,000 అన్నారు. స్పిన్ ది వీల్కనీస కొనుగోలు రూ.10,000 పై బంగారు నాణెం ఇవ్వనున్నామని చెప్పారు. ఆఫర్ ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 10, 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్.’ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ నటి నిధి అగర్వాల్ ను చూసేందుకు ఆమె అభిమానులు ఎగబడ్డారు. ముందుగా ఆమె స్టోర్ ప్రారంభించారు. అనంతరం ఆమె బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. కొంతమందికి సెల్ఫీలిచ్చారు. ఆమె రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది.





