మన ధ్యాస, కావలి, ఆగస్టు 27 : కావలి నియోజవర్గం ప్రజలు అందరూ ఆరోగ్యం ఉండాలి… అందులో మనం ఉండాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, కావలి, క్రిస్టియన్ పేటలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఏ.వి డయాగ్నోస్టిక్స్ సెంటర్’ను ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృషా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరీక్షలు స్థానికంగా లభించడం వల్ల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. నాణ్యమైన సేవలను అందిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు శ్రీనివాసులును ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పట్టణ ప్రజలకు సరసమైన ధరకు, ఖచ్చితమైన ఫలితాలతో కూడిన మంచి వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం నాయకులు బీద మస్తాన్ రావు విచ్చేసి డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. కావలి పట్టణ ప్రజలు ఆరోగ్య పరీక్షలకు సుదూర ప్రాంతాలైన నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన కావలి పట్టణంలో ఏవి డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆధునికమైన పరికరాలతో నెలకొల్పడం చాలా అభినందనీయం అని తెలిపారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా బీద మస్తాన్రావు అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీద గిరిధర్ యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్య యాదవ్ స్థానిక నాయకులు, నిర్వాహకుల మిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *