మన ధ్యాస,నిజాంసాగర్: బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పండుగను సోదరభావంతో జరుపుకోవాలని ఎస్‌ఐ రాజు సూచించారు.
వేడుకల సమయంలో పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముజాహిద్‌, ఖాసిం, ముస్లిం నాయకులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *