కలిగిరి ఆగస్టు 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలంలోని వీర్నకల్లు గ్రామంలో కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కత్తితో జరిగిన దాడిలో సంఘన రామిరెడ్డి (85) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన సంజీవ్ (30), రామిరెడ్డి మధ్య కులం పేరుతో దూషించాడన్న అంశంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ పరస్పరం దుర్భాషలాడుకోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. అనంతరం సంజీవ్ తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి రామిరెడ్డిపై పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన సంఘన రామిరెడ్డి మృతి చెందినట్లు కలిగిరి పోలీసులు ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా తెలిపారు. ఘటన అనంతరం సంజీవ్ స్వయంగా కలిగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.సమాచారం అందుకున్న కలిగిరి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలే ఇరువురి మధ్య వివాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *