మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం నిజాంసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా పండరి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సాంకేతిక రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సంకు లక్ష్మయ్య, నందాస్ మోహన్, వడ్ల బ్రహ్మం, కాంగ్రెస్ నాయకులు గుర్రపు శ్రీనివాస్, రాములు, బంగ్లా ప్రవీణ్, గాండ్ల రమేష్, వెంకట్, దత్తు, చిరంజీవి, సాయిలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

