​రేణిగుంట (ఆగష్టు 06):
​తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానాకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
​విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలగుచ్చాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని చైర్మన్‌కు జ్ఞాపికగా బహుకరించి గౌరవించారు.
​అలాగే వైయస్సార్సీపీ యూత్ స్టేట్ సెక్రటరీ డీజే సుధీర్ కుమార్, మనీ, వైస్ సర్పంచ్ మధు, తిరుపాల్ తదితరులు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
​విమానాశ్రయంలో ఈ స్వాగత సత్కారాల అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో జరిగే పలు సమీక్షా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *