రేణిగుంట (ఆగష్టు 06):
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానాకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలగుచ్చాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని చైర్మన్‌కు జ్ఞాపికగా బహుకరించి గౌరవించారు.
అలాగే వైయస్సార్సీపీ యూత్ స్టేట్ సెక్రటరీ డీజే సుధీర్ కుమార్, మనీ, వైస్ సర్పంచ్ మధు, తిరుపాల్ తదితరులు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో ఈ స్వాగత సత్కారాల అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో జరిగే పలు సమీక్షా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.
