రేణిగుంట ఆగష్టు 6.
తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కు తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్ రేణిగుంట ఎయిర్ పోర్టులో శాలువా వేసి, గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ పరమశివన్ మాట్లాడుతూ, ఎస్సీ లకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను శుక్రవారం ఉదయం పది గంటలకు పద్మావతి అతిధి గృహం, తిరుపతి చేరుకొని తమ తమ వినతులు సమర్పించుకోవచ్చని ఆయన తెలిపారు. చైర్మన్ కు స్వాగతం పలికిన వారిలో గాలి రవి, పి. ఎం.చంద్ర తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *