కొండాపురం, సెప్టెంబర్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కొండాపురం మండలంలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ కొండాపురం మండల అధ్యక్షులు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం కొండాపురంలో ఉన్న ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన భవనాన్ని నిర్మించి సీహెచ్‌సీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని వినతిపత్రంలో కోరారు.మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దీని కారణంగా ఎముకలు, కీళ్ల సంబంధిత ఆరోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.కొండాపురం మండలం భౌగోళికంగా ఏరియా ఆసుపత్రికి దూరంగా ఉన్నందున స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు.అలాగే కొండాపురం-కలిగిరి రోడ్డు సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *