తిరుపతి నగరంలోని 4వ డివిజన్, శ్రీనివాసపురం నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు.
కమిటీ వారి ఆహ్వానం మేరకు తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి విజ్ఞనాథున్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు పి. నాగరాజు, పి. కృష్ణయ్య, సునీల్, తరుణ్, మణికంఠ, అనిల్, దుర్గ, సాంబయ్య, చరణ్, ప్రశాంత్ లతో పాటు స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

