తిరుపతి, జూలై 30: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 37వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు డేరంగుల బాలాజీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం, దివ్యాంగులు మరియు అవసరమైన వారికి ఆహార పంపిణీ, కేక్ కటింగ్, ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం,తదితర కార్యక్రమాలను నిర్వహించి భూమన అభినయ్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.డేరంగుల బాలాజీ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న భూమన అభినయ్ రెడ్డి గారి నాయకత్వం యువతకు ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 37వ వార్డు నాయకులు, బాలాజీ మిత్రబృందం సభ్యులు ప్రకాష్ బచ్చు, పిచ్చయ్య, చుక్కల సుబ్రహ్మణ్యం, డేరంగుల ఢిల్లీ బాబు, ఆవుల సుధాకర్ యాదవ్, జి. సుబ్రహ్మణ్యం, పి. మధు ఆచారి, ముని నాయుడు, పి. నిరంజన్ ఆచారి (సాయి)తో పాటు పలువురు పార్టీ, వార్డ్ నాయకులు, పాల్గొని భూమన అభినయ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *