అభిమానం చాటుకున్న మిత్రులు, లారీ యాజమాన్యం, డ్రైవర్లు
డబ్బుల కిరీటంతో సత్కారం, వైభవంగా కేక్ కటింగ్ & అన్నదానం..
రేణిగుంట, సెప్టెంబర్ 19.
తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద గల తిరుమల ట్రాన్స్పోర్ట్ ప్రాంగణంలో, సంస్థ వ్యవస్థాపకులు అరుణ్ జన్మదిన వేడుకలు అభిమానుల కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరిగాయి.
వేడుకల్లో భాగంగా స్థానిక ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అరుణ్‌ను దుశ్శాలువాలతో శాలువా కప్పి గౌరవించారు. తమ అభిమానాన్ని చాటుకుంటూ నగదు (మనీ) తో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాన్ని ధరింపజేసి, నోట్ల మాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ట్రాన్స్పోర్ట్ ప్రాంగణంలో లారీ డ్రైవర్లు, ఇతర ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, స్థానిక యూత్ సమక్షంలో అరుణ్ భారీ కేక్ కట్ చేశారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత చెక్ పోస్ట్ వద్ద విచ్చేసిన ప్రజలకు, డ్రైవర్లకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థాపకులు అరుణ్ మాట్లాడుతూ… తన పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అజిత్, కార్తీక్, గుణ, శ్యామ్, దిలీప్, అశోక్, మునేష్, సాయి, రాజేష్, శ్యామ్, శరవన్ తదితర యూత్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో లారీ యాజమాన్యం, డ్రైవర్లు, స్థానిక ప్రజలు పాల్గొని అరుణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


