రేణిగుంట సెప్టెంబర్ 20

ఆదివారం మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ ఖాదరీ పుట్టిన రోజు వేడుకను ఆశ్రమ శిష్య బృందం సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఆశ్రమంలో తమ ఆధ్యాత్మిక గురువు గౌసియా ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఖాదరీ పీఠాధిపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాషాయక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఖ్వాజా జుబేర్ హయాత్ అలీ షా ఖాదరీ పుట్టినరోజుని పురస్కరించుకొని తమ గురువు చేత ఫాతెహా నిర్వహించి, కేక్ కట్ చేయించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి దీవెనలు పొందారు. పీఠాధిపతి మాట్లాడుతూ తమ జన్మదినాన్ని నిర్వహించినందుకు విచ్చేసిన భక్తులందరికీ ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ కరుణ కటాక్షాలు ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్టీలు, తిరుపతి ఏ1క్యాటరింగ్ ప్రొప్రైటర్ ఎస్ మస్తాన్ సాహెబ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాషాయక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి అబ్దుల్ రెహమాన్, మషాయాక్ అసోసియేషన్ రేణిగుంట అధ్యక్షులు రైటర్ మహబూబ్ బాషా, సత్తార్ ఖాదరీ, సుభాన్ ఖాదరీ, తిరుపతి ఫాన్సీ స్టోర్ జాఫర్, బాలాజీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *