ఉదయగిరి, జూలై 12 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..
నెల్లూరు జిల్లా ఉదయగిరి అంటేనే మెట్ట ప్రాంతం వేసవికాలం వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం ఎన్ని కష్టాలు పడతారో బోర్లలో నీళ్లు ఉండవు పంచాయితీ కొళాయిలలో నీళ్లు రావు నీళ్ల కోసం ఉదయగిరి ప్రజలు పడే శ్రమ వర్ణించలేనిది ఇలాంటి సమయాలలో ఉదయగిరి ప్రజలకు గుర్తొచ్చేది ఆ అన్నదమ్ములు రామలక్ష్మణులే ఈ రామలక్ష్మణులు ఉదయగిరి ప్రజల పాలిట దేవుళ్ళు నీళ్లు లేవు దాహం వేస్తుంది అని అర్ధరాత్రి ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఆ టైంలోనే తమ సొంత ట్యాంకర్ తో నీళ్లు తీసుకువెళ్లి వాళ్ళ దాహాన్ని తీరుస్తూ వాళ్ళ కష్టాలలో మేము మీకు ఉన్నాము అని భరోసా కల్పిస్తూ నీళ్ల కోసం పేద ప్రజలు పడుతున్న కష్టాన్ని తీరుస్తున్న మంచి మనసున్న మహారాజులు ఈ రామలక్ష్మణులు సొంత నిధులతో ఉదయగిరి ప్రజల దాహాన్ని తీరుస్తూ ఒక్కరోజులో సుమారు 200 కుటుంబాలకు నీళ్లు అవసరం తెలియకుండా వీరి సేవలు వారికి అందిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనసున్న అన్నదమ్ములను ఆ దేవుడు చల్లగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు..
