వరికుంటపాడు జూలై 12 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

అమ్మ కరుణించి కాపాడమ్మా అంటూ మనసా దేవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాల లో చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆస్త్రముల చేత మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహాస్నాపానం, పూర్ణాహుతి, గ్రామంలోని మహిళలు తో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, పొంగళ్ళు వంటి తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు మధ్యాహ్నం ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలు చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *