జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28
దేశవ్యాప్త పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం శివిని గ్రామ పంచాయతీలో పోలియో చుక్కల కార్యక్రమం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్, రమేష్ శివిని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గాముఖ్య అతిథులుగా హాజరై, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
గ్రామంలో 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు మొత్తం 151 మంది నమోదవ్వగా, ఉదయం 9:50 నిమిషాల సమయానికే 43 మంది చిన్నారులకు విజయవంతంగా పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన చిన్నారులందరికీ వంద శాతం పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యత. అధికారుల పిలుపు
ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, తల్లులు పాల్గొని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *