ఉదయగిరి, జూన్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె…
ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ దుంప వారి పల్లి గ్రామానికి చెందిన ఆదికొండు పుల్లయ్య కి ఇటీవల కాలంలో స్ట్రోక్ పెరాలసిస్ వంటి అనారోగ్యాలతో బెంగళూరుకు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకొని కిమ్స్ హాస్పిటల్ చేరుకున్న ఆదికొండు పుల్లయ్యని పరామర్శించి న మన్నేటి వెంకట రెడ్డి అనంతరం,కుటుంబ సభ్యులు తో కలిసి మాట్లాడగా పుల్లయ్య కుమారుడు ఇప్పటికే 30 నుండి 40 లక్షలు ఖర్చు పెట్టామని టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి కి తెలియజేశారు.పుల్లయ్య ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ద్వారా అడిగి,తెలుసుకున్నారు.అనంతరం కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ గిరి నాయుడు తో మాట్లాడి పుల్లయ్యకి మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు. పుల్లయ్య కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తామని కుటుంబ సభ్యులకు తెలియజేసి భరోసా ఇచ్చారు.