రేణిగుంట జూన్ 26.గాజులమండ్యంలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా కొలువుదీరిన శ్రీరాముడికి, సీతాదేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం అత్యంత వైభవంగా సాగింది. సీతారాముల పరస్పర తలంబ్రాల దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. అనంతరం సంగీత నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు గాజులమండ్యంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *