​- 3 కిలోమీటర్ల మేర సైకిల్‌పై పద్మావతి నగర్ లేఔట్‌ను పరిశీలించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి జూన్5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడా చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్నంగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఆయన కూటమి నాయకులతో కలిసి సైకిల్ పర్యటన చేపట్టారు.తుకివాకం పద్మావతి నగర్ లేఔట్ ఆర్చ్ వద్ద ప్రారంభమైన సైకిల్ పర్యటన సురప్పకశం పద్మావతి నగర్ లేఔట్ వరకు ఉత్సాహంగా కొనసాగింది.సుమారు 3 కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పద్మావతి నగర్ లేఔట్‌లోని అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.వాహన కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ తో పాటు పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రతినిధులు సైకిళ్లపై ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని నింపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *