రేణిగుంట జూన్ 4.రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన మేఘనాథ్ తండ్రి అగసారపు క్రిష్ణయ్య , గురువారం ఉదయం ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరకంబాడిలోని బీసీ కాలనీలో ఉన్న క్రిష్ణయ్య స్వగృహానికి డాలర్స్ దివాకర్ రెడ్డి వెళ్లి,ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి తన ప్రగాఢ సానుభూతిని మరియు ధైర్యాన్ని తెలియజేశారు.


