మన ధ్యాస ,నిజాంసాగర్,: ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.పండరీ మాట్లాడుతూ..ఈ సమావేశంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం,బూత్ కమిటీలను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటర్ల వివరాల పరిశీలన,కొత్త సభ్యత్వ నమోదు,పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మండలంలోని ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.