మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మద్నూర్,బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు,దాతల సహకారం,ఐకేఎఫ్ నిధుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి,ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సమస్యలైన కాంపౌండ్ వాల్ నిర్మాణం,మంచాల కొరత, స్ట్రెచర్లు,బాత్రూమ్ సౌకర్యాల మెరుగుదల,తాగునీటి సదుపాయం,నర్సింగ్ స్టాఫ్ కొరత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు పొందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సమయపాలన,అత్యవసర సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సీమా షెట్కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్ లు ముజాహిద్,సంధాని, గంగాధర్, కార్తిక,నౌషా నాయక్,తహసీల్దార్ నాగరాజు గౌడ్,ముజీవుద్దిన్ వైద్యులు మండల అధ్యక్షులు,నాయకులు తదితరులు ఉన్నారు.
