ఓబులవారిపల్లి మే 30.
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి గనులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సందర్శించారు. కాలుష్యం కారణంగా తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్ 2 ఆయన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు సమస్యలు తదితర అంశాల గురించి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం గ్రామ తరలింపు కొరకు ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ చేపట్టిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఆర్డీవో రామ్మోహన్ తాసిల్దార్ యామిని మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం ఏపీఎండిసి మంగంపేట ముగ్గురాయి గనులను ఆయన సందర్శించారు ఇక్కడ లభిస్తున్న ముగ్గురాయి ఖనిజం గురించి మంగంపేట ఏపిఎండిసి చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపీనాథ్ జాయింట్ కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది ఏపీఎండిసి సిబ్బంది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *